Page Loader
Farmer Protest: నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు
నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు

Farmer Protest: నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2025
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతలు చర్చల విషయంలో ఒక అంగీకారానికి వచ్చారు. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ప్రియ రంజన్, ఎస్కేఎం (రాజకీయేతర), కేఎంఎం సంఘాల నేతలతో శనివారం శంభు సరిహద్దు వద్ద నిర్వహించిన చర్చలు విజయవంతంగా ముగియడంతో చర్చల తేదీ ఖరారైంది.

వివరాలు 

డల్లేవాల్‌కు చికిత్స మొదలు

55 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత డల్లేవాల్‌తో కూడా కేంద్ర బృందం చర్చలు నిర్వహించింది. రైతుల డిమాండ్లపై చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలపడంతో, రైతు నేతలు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, డల్లేవాల్ వైద్య చికిత్సకు అంగీకరించారు. కేంద్రంతో జరిగే చర్చల్లో డల్లేవాల్ పాల్గొనే అవకాశం ఉంది. జనవరి 26న ఢిల్లీ వైపు తాము నిర్వహించదలచిన కవాతులో ఎలాంటి మార్పు ఉండదని రైతు నేతలు స్పష్టం చేశారు.