Page Loader
Train Accident: ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో పట్టాలు తప్పిన  చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ 
ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో పట్టాలు తప్పిన చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్

Train Accident: ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో పట్టాలు తప్పిన  చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2024
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓ ఎక్స్‌ప్రెస్ కోచ్ పట్టాలు తప్పింది. దీంతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా సమాచారం అందలేదని చెబుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ లోని గోండాలో ఈరోజు రైలు ప్రమాదం జరిగింది. చండీగఢ్‌ నుంచి దిబ్రూగఢ్‌ వెళ్తున్న దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌ పట్టాలు తప్పింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 10 నుంచి 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. గోండా సమీపంలోని జిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో డిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైలు పట్టాలు తప్పిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

వివరాలు 

దర్యాప్తు ప్రారంభించిన రైల్వే శాఖ 

రైలు ఆగిన వెంటనే ప్రయాణికులు కేకలు వేస్తూ బయటకు వచ్చారు.అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం ఇంతవరకు వెల్లడి కాలేదు. ఈ ఘటనకు గల కారణాలపై రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Train Accident: పట్టాలు తప్పిన  చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్