Page Loader
Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
ఏపీలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2025
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి వేగంగా సాగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల ప్రభావంతో దేశీయ, విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ముందుకొస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు ఆరు ఎస్‌ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొమోషన్ బోర్డు) సమావేశాల్లో మొత్తం 76 ప్రాజెక్టులకు రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,50,934 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని చెప్పారు. ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న సంస్థల ప్రాజెక్టుల పురోగతిని డాష్‌బోర్డు ద్వారా నిత్యం పర్యవేక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

వివరాలు 

దాదాపు 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు

వెంకట రామ నాయుడు సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగిన 6వ ఎస్‌ఐపీబీ సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో 19 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు రూ.33,000 కోట్ల పెట్టుబడులకు అనుమతి ఇచ్చారు. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నట్లు వెల్లడించారు. ఎనర్జీ,టూరిజం,ఐటీ,ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్న సంస్థల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, ప్రతి ప్రాజెక్టు శంకుస్థాపన నుంచి ప్రారంభ దశ వరకు అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని సీఎం సూచించారు. అలాగే, ప్రాజెక్టుల పురోగతిపై నిరంతరంగా ఫాలోఅప్ చేయాలని, వాటికి సంబంధించిన సమాచారం ఒక కేంద్రికృత డాష్‌బోర్డ్‌లో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

వివరాలు 

ప్రభుత్వ లక్ష్యం 50,000 హోటల్ గదులు

పర్యాటక రంగంపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. హోటళ్ల గదుల కొరత రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉందని పేర్కొంటూ, పెద్దఎత్తున హోటల్ రూమ్‌లు అందుబాటులోకి వస్తే పర్యాటకానికి కొత్త ఊపు చేకూరుతుందన్నారు. ప్రభుత్వ లక్ష్యం 50,000 హోటల్ గదులు అందుబాటులోకి తేవడమేనని చెప్పారు. గదుల ధరలు సామాన్య పర్యాటకులకు అందుబాటులో ఉంటే, వారు ఆయా ప్రాంతాల్లో తలదించుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కందుల దుర్గేష్ చేసిన ట్వీట్