Page Loader
చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా.. రేపు ఉదయం 10.30 నిర్ణయం
చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా.. రేపు ఉదయం 10.30 నిర్ణయం

చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా.. రేపు ఉదయం 10.30 నిర్ణయం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 21, 2023
06:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం 10.30గంటలకు తుది నిర్ణయం వెలువరించనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. మరోవైపు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ హైకోర్టులో ఉన్న నేపథ్యంలో తీర్పు వాయిదా పడినట్టు తెలుస్తోంది. శుక్రవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్‌ అయితే తీర్పు వాయిదా వేస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. క్వాష్‌ పిటిషన్‌ లిస్ట్‌ కాకుంతే మాత్రం తీర్పు వెలువరిస్తామన్నారు. అమరావతి రింగ్‌రోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో ఏపీ సీఐడీ వేసిన పీటీ వారెంట్లపై శుక్రవారం విచారించనున్నట్లు ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.

DETAILS

ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పు రేపటికి వాయిదా

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలతో చంద్రబాబును విచారించేందుకు కస్టడీ అక్కర్లేదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ఇదే సమయంలో 5 రోజుల కస్టడీని కోరిన సీఐడీ పిటిషన్‌ను తిరస్కరించాలని అభ్యర్థించారు. పోలీస్ కస్టడీ పేరిట విచారణ చేపట్టి, ఆయా వివరాలను ఎంపిక చేసుకున్న ఛానెళ్లతో ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. చంద్రబాబు ప్రతిష్ఠను ప్రజల్లో దెబ్బతీసే లక్ష్యంతోనే దర్యాప్తు సంస్థ ఉవ్విళ్లూరుతోందన్నారు. వాస్తవాలు వెలికితీయాలంటే పోలీస్ కస్టడీలో విచారణ అవసరమని సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయయూర్తి ప్రకటించారు.