NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏపీ అసెంబ్లీలో సవాళ్ల పర్వం.. మీసం తిప్పిన బాలయ్య.. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే
    తదుపరి వార్తా కథనం
    ఏపీ అసెంబ్లీలో సవాళ్ల పర్వం.. మీసం తిప్పిన బాలయ్య.. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే
    తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

    ఏపీ అసెంబ్లీలో సవాళ్ల పర్వం.. మీసం తిప్పిన బాలయ్య.. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 21, 2023
    05:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఓ ఎమ్మెల్యే మీసం తిప్పితే, మరో ఎమ్మెల్యే తొడకొట్టారు. బయటకు రా చూసుకుందాం అంటూ సవాళ్లు విసురుకున్నారు.

    శాసనసభ సమావేశాలు మొదలైన కాసేపటికే అధికార, ప్రతిపక్షాలు మధ్య హాట్ హాట్ వాతావరణం నెలకొంది.

    హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి అంబటి రాంబాబుల మధ్య మాటల తూటాలు పేలాయి.

    చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుపై చర్చ చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీనిపై వాయిదా తీర్మానానికి తెలుగుదేశం సభ్యులు పట్టుబడుతూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.

    ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్య సభ సాగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పి సంచలనానికి తెరలేపారు.

    DETAILS

    ఇరుపక్షాల ఆందోళనల మధ్య 10 నిమిషాలు వాయిదా పడ్డ సభ

    ఈ మేరకు మంత్రి అంబటి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మీసాలు సినిమాల్లో తిప్పుకోవాలని, సభలో కాదని అంబటి హితవు పలికారు.

    అంతలోనే రా చూసుకుందాం అంటూ బాలకృష్ణను సవాల్ చేయడంతో సభ వేడెక్కింది. ఈ పరిణామాన్ని ఆసక్తిగా గమనించిన వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, బాలకృష్ణకు తొడకొట్టి సవాల్ చేశారు.

    సభ వాయిదా తర్వాత చంద్రబాబు అరెస్టుపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది.ఈ మేరకు స్పీకర్ పోడియం వద్ద పేపర్లు విసురుతూ నిరసన చేపట్టింది.

    తెలుగుదేశం ప్రవర్తనతో అవాంఛనీయం జరగనుందని మంత్రి అంబటి అంటుండగా,రండి చూసుకుందాం అని బాలకృష్ణ చేత్తో సైగలు చేశారు.

    దీంతో బాలకృష్ణకు వ్యతిరేకంగా వైసీపీ పోడియం వద్ద నిరసన తెలుపగా, సభ పది నిమిషాలు వాయిదా పడింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అసెంబ్లీలో మీసం మెలేసిన బాలయ్య

    అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య.. మీసాలు సినిమాల్లో తిప్పుకో బాలయ్య.. ఇది అసెంబ్లీ.. దమ్ముంటే రా.. అంటూ అంబటి సవాల్.. #ysrcp #YSRCPSocialMedia #cmjagan #TDP #chandrababu #APassembly #APnews #2024elections #ambatirambabu pic.twitter.com/NJNECamBMJ

    — raghu addanki (@raghuaddanki1) September 21, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    బాలకృష్ణ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

    ఆంధ్రప్రదేశ్: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అనూహ్య ప్రగతి: గవర్నర్ అబ్దుల్ నజీర్ గవర్నర్
    మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చాం: అసెంబ్లీలో సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    బాలకృష్ణ

    బాలయ్య తర్వాతి సినిమాకు హీరోయిన్ కష్టాలు తీరినట్లే? తెలుగు సినిమా
    మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న? తెలుగు సినిమా
    అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్: రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న బాలకృష్ణ అన్ స్టాపబుల్
    అన్ స్టాపబుల్: హర్ట్ అయిన నర్సులు, సారీతో సర్దిచెప్పేసిన బాలకృష్ణ అన్ స్టాపబుల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025