ఏపీ అసెంబ్లీలో రగడ.. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. తమ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ శాసనసభలో పసుపు పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. అంతకుముందు సభా కార్యక్రమాలకు టీడీపీ శాసనసభ్యులు పదేపదే అడ్డుతగులుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సహా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే శ్రీదేవిని సస్పెండ్ చేస్తున్నట్లు తమ్మినేని ప్రకటించారు. అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, బెండాలం అశోక్, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల, చినరాజప్ప, గణబాబు పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, నిమ్మల, మంతెన రామరాజు, గొట్టిపాటి, ఏలూరి సాంబశివరావు డోలా బాల వీరాంజనేయస్వామి సస్పెండ్ అయ్యారు.