Page Loader
ఏపీ ప్రభుత్వంపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు హత్యకు కుట్ర
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు హత్యకు కుట్ర

ఏపీ ప్రభుత్వంపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు హత్యకు కుట్ర

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 21, 2023
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరం జైల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆయనకు ఎటువంటి హాని జరిగినా సీఎం జగన్‌ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఆధారాలు లేని కేసులో బాబును అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. Z ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్ష నేతకి జైల్లో భద్రత లేదని లోకేష్ ఆవేదన చెందుతున్నారు. విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవట్లేదన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రబాబును అంతం చేసేందుకే ఏపీ సర్కార్ కుట్ర