Page Loader
చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. కీలక విషయాలు చెప్పిన వైద్యులు 
చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. కీలక విషయాలు చెప్పిన వైద్యులు

చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. కీలక విషయాలు చెప్పిన వైద్యులు 

వ్రాసిన వారు Stalin
Oct 14, 2023
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కిల్ స్కామ్‌లో ఆరోపణలు ఎందుర్కొంటూ.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బులిటెన్‌ను విడుదల చేశారు. హెల్త్ బులిటెన్‌లో రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు కీలక విషయాలను వెల్లడించారు. చంద్రబాబుకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు మెడికల్ రిపోర్టులో పేర్కొన్నారు. చంద్రాబాబు అనారోగ్యంతో బాధపడుతున్నా, జైలు అధికారులు మాత్రం అంతా బాగానే ఉన్నట్లు చెబుతున్నారని టీడీపీ నేతలు, నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు శరీర భాగాల్లో స్కిన్ అలెర్జీ ఉన్నట్టు వైద్యులు తమ నివేదికలో చెప్పారు. ముఖ్యంగా గడ్డం మీద, అరచేతియి.. చాతి భాగంలో దద్దుర్లు వచ్చి, చర్మం రంగుమారినట్లుగా రిపోర్టులో తేలింది. చంద్రబాబు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు డాక్టర్లు చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎలర్జీతో బాధపడుతున్న చంద్రబాబు