Page Loader
Revanth Reddy: కేసీఆర్‌, చంద్రబాబు, జగన్‌‌ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి 
Revanth Reddy: కేసీఆర్‌, చంద్రబాబు, జగన్‌‌ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: కేసీఆర్‌, చంద్రబాబు, జగన్‌‌ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి 

వ్రాసిన వారు Stalin
Dec 06, 2023
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సీఎంగా రేవంత్‌ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1 గంటకు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. తన ప్రమాణస్వీకారానికి రేవంత్ రెడ్డి ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను మాత్రమే కాకుండా మరికొందరికి కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ మిత్రపక్షాల సీఎంలు, మాజీ సీఎంలు, రాజకీయ ప్రముఖులకు రేవంత్ ఆహ్వానం పంపారు. రేవంత్ ఆహ్వానించిన వారిలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఏపీ సీఎం జగన్‌, టీడీపీ చీఫ్ చంద్రబాబు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉన్నారు.

రేవంత్

హాజరుకానున్న సోనియా గాంధీ, రాహుల్

కాంగ్రెస్ పార్టీ నుంచి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారానికి రానున్నారు. ఈ మేరకు వీరిని రేవంత్ రెడ్డి దిల్లీలో స్వయంగా ఆహ్వానించారు. అంతేకాకుండా తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో పాటు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య, ప్రొఫెసర్‌ నాగేశ్వర్, గాదె ఇన్నయ్యకు కూడా రేవంత్ ఆహ్వానాలను పంపారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కోసం ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత రాజ్ భవన్‌లోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయగా.. అక్కడ వాయిదా పడింది ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 1గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.