LOADING...
Chandrababu: విశాఖ పర్యాటక రంగంలో మరో ఆణిముత్యం..డబుల్‌ డెక్కర్‌ బస్సులు ప్రారంభం 
విశాఖ పర్యాటక రంగంలో మరో ఆణిముత్యం..డబుల్‌ డెక్కర్‌ బస్సులు ప్రారంభం

Chandrababu: విశాఖ పర్యాటక రంగంలో మరో ఆణిముత్యం..డబుల్‌ డెక్కర్‌ బస్సులు ప్రారంభం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
04:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం పర్యాటక రంగంలో మరో కీలక మైలురాయి చేరుకుంది. సాగర తీరాల అందాలను ఎత్తైన ఎత్తులోనుంచి ఆస్వాదించాలన్న నగర వాసుల కోరిక ఇప్పుడు నిజమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నగరంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను అధికారంగా ప్రారంభించారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. ఈ పర్యాటక బస్సులు ఆర్కే బీచ్‌ నుంచి తొట్లకొండ వరకు, సుమారు 16 కి.మీ మేర పర్యాటక బస్సులు తిరగనున్నాయి.

వివరాలు 

మహిళలకు సురక్షితమైన నగరంగా విశాఖ

విశాఖపట్నం బీచ్‌లను ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు. గత పాలకులు విశాఖను రాజధానిగా చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, అవసరం లేదని తీర్పిచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖ ఆసియా టెక్నాలజీ హబ్‌గా, రాష్ట్ర ఆర్థిక రాజధానిగా మారుతున్నదని ఆయన తెలిపారు. అలాగే, విశాఖలో త్వరలో డేటా సెంటర్, సీ కేబుల్‌ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఈ సీ కేబుల్‌ ద్వారా విశాఖపట్నం ప్రపంచంతో నేరుగా అనుసంధానం అవుతుందని చెప్పారు. మహిళలకు సురక్షితమైన నగరంగా విశాఖ ఎంపికైందని సీఎం అన్నారు. దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నైతో విశాఖ పోటీపడుతోందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విశాఖపట్నం బీచ్ రోడ్ లో హోప్ ఆన్ హోప్ డబుల్ డెక్కర్ బస్సుల ప్రారంభం