Chandrababu naidu: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం.. బోటులో వెళ్తుండగా..
విజయవాడ పట్టణాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజల జీవనం స్థంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో సహాయ చర్యలు వేగంగా చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఆయన అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ముంపుకు గురైన ప్రాంతాల్లో బోటు ద్వారా పర్యటించారు. పర్యటనలో భారీ ప్రమాదం తప్పింది. సీఎం ఎక్కిన బోటు ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా ఒక వైపు ఒరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బోటును సరిచేసి తిరిగి క్రమపద్ధతిలోకి తెచ్చారు. పరిస్థితి అదుపులోకి రావడంతో అధికారులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాబు వెంట ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆయన అధికారులకు క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు.