TDP-Janasena-BJP: అమిత్‌షా,నడ్డాలతో చంద్రబాబు, పవన్ భేటీ.. నేడు పొత్తుపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.. ఈ క్రమంలో పొత్తుపై ప్రాంతీయ పార్టీలతో చర్చలు సాగుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీల పొత్తుపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి.
జనసేన పార్టీ (జేఎస్పీ) అధినేత పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షాతో చంద్రబాబు నాయుడు సమావేశానికి హాజరైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.తమ ప్రతిపాదిత పొత్తు, సీట్ల పంపకాల ఫార్ములాపై చర్చించారు. చంద్రబాబు నాయుడు గురువారం హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు.
Details
7 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలను కోరుతున్న బీజేపీ
ఇదిలా ఉండగా, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరునగర్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, "పొత్తుపై ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది" అని తెలిపారు.
కాగా, 7 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలను బీజేపీ కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం కూటమిలో ఉన్న జనసేన పార్టీకి 3 లోక్‌సభ, 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినందున భాజపాకు అడిగినన్ని సీట్లు సర్దుబాటు చేయడం సాధ్యం కాదన్న వాదన టిడిపి వైపు నుంచి వినిపిస్తోంది.
మొత్తంగా బీజేపీ, జనసేనలకు కలిపి 7 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం.
చర్చల అనంతరం ఈ సంఖ్యలో కొంత అటూ ఇటూ మార్పు ఉండొచ్చని అంటున్నారు.
Details
పొత్తుపై స్పష్టత రావాలి: టీడీపీ
ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.
రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉంది.
గత నెల నుంచి బీజేపీ అగ్రనేతలను కలవడానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు.బీజేపీతో పొత్తు ఖరారు చేసేందుకు నాయుడు ఈ పర్యటన చేస్తున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్‌కు ఇంకా ఎక్కువ సమయం లేదు కాబట్టి పొత్తుపై స్పష్టత రావాలని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే జేఎస్పీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది.ఇటీవల టీడీపీ-జేఎస్పీ కూటమి 99 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను అసెంబ్లీ ఎన్నికలకు విడుదల చేసింది.
జేఎస్పీ 24 అసెంబ్లీ స్థానాలు,మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది.