NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ADR: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు.. పేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ 
    తదుపరి వార్తా కథనం
    ADR: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు.. పేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ 
    ADR: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు.. పేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ

    ADR: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు.. పేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 31, 2024
    08:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా గుర్తింపుపొందారు.

    ఆయన కుటుంబం కలిపి మొత్తం రూ.931 కోట్ల ఆస్తులున్నాయి. రూ.10 కోట్ల అప్పు కూడా ఉంది.

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.15 లక్షల ఆస్తితో ఈ జాబితాలో అట్టడుగున నిలిచారు.

    అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరు మీద రూ.36 కోట్ల ఆస్తులు ఉండగా, ఆయన భార్య భువనేశ్వరి పేరిట రూ.895 కోట్ల ఆస్తులున్నాయి.

    ఇందులో హెరిటేజ్ ఫుడ్స్‌లో ఉన్న షేర్లు కూడా చేర్చారు.

    వివరాలు 

    31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లు 

    ఏడీఆర్ నివేదిక ప్రకారం,రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.52.59 కోట్లుగా ఉంది.

    ముఖ్యమంత్రుల సగటు వార్షిక ఆదాయం రూ.13,64,310గా ఉంది. 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లుగా ఉంది.

    సంపన్న ముఖ్యమంత్రులలో రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ.332 కోట్ల ఆస్తితో ఉన్నారు,అయితే ఆయనకు రూ.180 కోట్ల అప్పు ఉంది.

    కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మూడో స్థానంలో రూ.51 కోట్ల ఆస్తులతో ఉండగా,ఆయనకు రూ.23 కోట్ల అప్పు ఉంది.

    జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ.55 లక్షల ఆస్తులతో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉన్నారు.

    కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రూ.1.18 కోట్ల ఆస్తులతో అట్టడుగు నుంచి మూడో స్థానంలో నిలిచారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముఖ్యమంత్రి

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    ముఖ్యమంత్రి

    Congress: కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యత ఏఐసీసీకి అప్పగింత కాంగ్రెస్
    CM Jagan: మిచౌంగ్‌ తుపాను తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష.. సహాయక చర్యలకు ఆదేశం  ఆంధ్రప్రదేశ్
    Telangana CM: తెలంగాణ సీఎంను ఈ రోజే ప్రకటిస్తామని ఖర్గే ప్రకటన.. దిల్లీకి భట్టి, ఉత్తమ్‌  మల్లికార్జున ఖర్గే
    Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణ ప్రమాణస్వీకారం.. రాహుల్ గాంధీ హింట్  రేవంత్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025