Chandrababu: మద్యం పాలసీలో కుంభకోణం.. జగన్ పై సీఐడీ విచారణకు ఆదేశించిన చంద్రబాబు
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన మద్యం పాలసీలో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ)తో విచారణకు ఆదేశించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారని, ఇది ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద కుంభకోణమని ది హిందూ తెలిపింది. దీనిపై సీఐడీతో సమగ్ర విచారణ జరిపిస్తామని అసెంబ్లీ లో చంద్రబాబు చెప్పారు.
ఈ కేసును ఈడీకి సిఫార్సు చేస్తాం
రాష్ట్ర ప్రభుత్వ లావాదేవీల్లో అక్రమాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కూడా రిఫర్ చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. గత ఐదేళ్లలో రూ. 99,413 కోట్ల రిటైల్ విక్రయాలు జరగ్గా, కేవలం రూ. 615 కోట్ల విక్రయాలకు సంబంధించి డిజిటల్ చెల్లింపులు జరిగాయని నాయుడు చెప్పారు. దీని వల్ల 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ఖజానాకు రూ.18,860 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని తెలిపారు.
రాజకీయ పగ లేదు- నాయుడు
ఈ కేసులో ఎలాంటి రాజకీయ ప్రేరేపణ కోసం చర్యలు తీసుకోవడం లేదని, అయితే ఈ కుంభకోణానికి పాల్పడిన వారందరిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని నాయుడు అన్నారు. పాపులర్ బ్రాండ్ల బీర్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని, గతంలో తెలియని లోకల్ బ్రాండ్ల విక్రయాలు జీరో నుంచి 12 లక్షలకు పెరిగాయని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో గత 5 ఏళ్లు చూపించిందన్నారు.