
Chandrababu: 53 రోజుల తర్వాత బెయిల్‌పై చంద్రబాబు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 53 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు.
మంగళవారం సాయంత్రం ఆయన జైలు నుంచి బయటికొచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు.
చంద్రబాబు విడుదల కావడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకొని చంద్రబాబుకు స్వాగతం పలికారు.
చంద్రబాబు జైలు నుంచి బయటికొచ్చిన అనంతరం మద్దతుదారులకు, పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు.
Details
ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ నాయకులు
జైలు వద్దకు నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ, తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఏలూరి సాంబశివరావు, టి.డి.జనార్దన్ విచ్చేశారు.
భారీగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులను నిలువరించేందుకు పోలీసుల బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని తోసుకుంటూ జైలువద్దకు కార్యకర్తలు దూసుకొచ్చారు