Page Loader
CM Chandrababu:గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన

CM Chandrababu:గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 30, 2024
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో 90శాతం ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సమక్షంలో తెలుగు గంగ ప్రాజెక్టుపై ఒప్పందం జరిగిందని గుర్తు చేసిన చంద్రబాబు, ఎన్టీఆర్‌ నేతృత్వంలో రాయలసీమకు తెలుగుగంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చినట్లు చెప్పారు. వెలిగొండ, తోటపల్లి ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే ప్రారంభించామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో నీటి కొరతను తగ్గించడమే లక్ష్యమని వివరించారు. రాయలసీమను రత్నాలసీమగా మార్చేందుకు నీటిని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఉద్యాన పంటలతో అనంతపురం తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని వివరించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్‌ ఛేంజర్‌గా మారబోతుందని చంద్రబాబు అన్నారు.

Details

రూ.80వేల కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ప్రతిపాదనలు

బనకచర్ల రెగ్యులేటర్‌ ద్వారా రోజుకు కనీసం 2 టీఎంసీల నీటిని తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నదుల అనుసంధానం ద్వారా కరవు, వరదల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. మొదటి దశలో పోలవరం నుంచి కృష్ణా నదికి నీటిని మళ్లించడం, రెండో దశలో బొల్లాపల్లి జలాశయం నిర్మాణం, మూడో దశలో బొల్లాపల్లి నుంచి బనకచర్లకు నీటిని తరలిస్తామన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు రూ.80 వేల కోట్ల వ్యయంతో నిర్మించేందుకు డీపీఆర్‌ రూపొందించామని, 2-3 నెలల్లో టెండర్లు పిలుస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రైవేటు సంస్థల సహకారంతో నిర్మాణం, నిర్వహణ పనులను చేపట్టే విధానాన్ని అమలు చేస్తామన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి భావితరాలకు నీటి సమస్యలు లేకుండా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.