LOADING...
CM Chandrababu:చంద్రబాబు కీలక ప్రకటన.. గ్రీన్‌ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు 
చంద్రబాబు కీలక ప్రకటన.. గ్రీన్‌ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు

CM Chandrababu:చంద్రబాబు కీలక ప్రకటన.. గ్రీన్‌ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 11, 2025
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ హైడ్రోజన్‌ను ఎరువులు, రసాయనాలు తయారు చేసేందుకు ఉపయోగిస్తారని, హరిత ఇంధనం ద్వారా తయారైన ఉత్పత్తులకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా, హైడ్రోజన్‌ వాడడం వల్ల అల్యూమినియం మరియు ఉక్కు ఉత్పత్తిలో వేడి తగ్గే అవకాసం ఉన్నదని వివరించారు. ఈ సందర్భంగా, గ్రీన్‌కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ను టేకోవర్‌ చేస్తుందన్నారు. అక్కడ గ్రీన్‌ అమోనియా తయారీ జరిగి విదేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. ఈ ప్లాంట్‌లో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు పెడతారని పేర్కొన్నారు.

Details

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచితంగా సౌర ఫలకాలు

అదనంగా రిలయన్స్‌ కంపెనీ 500 బయో కంప్రెస్డ్‌ గ్యాస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుందని, ఒక్కో కేంద్రానికి రూ.130 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారని తెలిపారు. బయోగ్యాస్‌ ఉత్పత్తికి గడ్డి ఉపయోగిస్తారని, ఈ గడ్డిని పెంచేందుకు రైతులకు ఎకరాకు రూ.30 వేలు కౌలుగా చెల్లించనున్నారు. స్వాపింగ్‌ బ్యాటరీల మోడల్‌ను బెంగళూరు సంస్థ కుప్పానికి తీసుకువచ్చింది. సూర్యఘర్‌ లో నివసిస్తున్న ఇళ్ల యజమానులకు ఈ బ్యాటరీల ఛార్జింగ్‌కు డబ్బు చెల్లిస్తారని, ఇది వారి అదనపు ఆదాయం అవుతుందని చెప్పారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలతో కూడా ముందుకు వెళ్ళిపోతున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచితంగా సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చంద్రబాబు తెలిపారు.