Chandrababu: నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఈ వార్తాకథనం ఏంటి
ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు.
తన సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, మూడ్రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కుప్పం రూపురేఖలను మార్పుచేసేందుకు రూపొందించిన 'స్వర్ణ కుప్పం' పథకం ప్రారంభానికి ఈ పర్యటన ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది.
వచ్చే ఐదేళ్లలో కుప్పం సమగ్ర అభివృద్ధి కోసం 'స్వర్ణ కుప్పం-విజన్ 2029' పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఆది, సోమ, మంగళవారం సీఎం కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నేడు ద్రవిడ యూనివర్శిటీలో 'స్వర్ణ కుప్పం-విజన్ 2029' డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్నారు.
Details
కుప్పం రెండు కొత్త డైరీలు ఏర్పాటు
ఈ పథకంతో కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఉంచారు. సుమారు మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం కుప్పంలో రెండు కొత్త డైరీలను ఏర్పాటు చేయనున్నారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
స్వర్ణ కుప్పం-విజన్ 2029 విడుదల అనంతరం సోమవారం నడిమూరు గ్రామంలో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభించనున్నారు.
సీగలపల్లెలో 'ఆర్గానిక్ కుప్పం' కార్యక్రమంలో ప్రకృతి సేద్యం రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు.
Details
జనవరి 8న విశాఖకు వెళ్లనున్న చంద్రబాబు
రాత్రికి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారు. మంగళవారం ఉదయం సీఎం టీడీపీ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను కలుస్తారు.
మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
సాయంత్రం కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
ఇక జనవరి 8వ తేదీ ఉదయం సీఎం విశాఖపట్టణానికి వెళ్లి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.