
Chandrababu: ఏపీలోని ఆటో డ్రైవర్‌లకు గుడ్ న్యూస్.. దసరాకు మరో కొత్త పథకం
ఈ వార్తాకథనం ఏంటి
సంక్షేమం అంటే కేవలం ఓట్ల రాజకీయం కాదు,వారి జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఉండాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 'సూపర్ సిక్స్.. సూపర్ హిట్' పేరిట కూటమి పార్టీల ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో సీఎం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా దసరా రోజున వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించి, ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.15,000 చొప్పున ఇవ్వనున్నట్టు వెల్లడించారు. చంద్రబాబు మాట్లాడుతూ,"సూపర్ 6 హామీలను పూర్తి చేసి,మాట నిలబెట్టుకున్నాం. జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వం మాది. ఎన్నో కష్టాలు ఎదురైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి 95శాతం పైగా పైగా స్ట్రైక్ రేట్ ఇచ్చారు.
వివరాలు
స్త్రీశక్తి పథకం ద్వారా 5 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణం
తెలుగు తమ్ముళ్ల వేగం, జనసేన ఉత్సాహం, కమలదళం ప్రేరణ - ఇవన్నీ నిర్లక్ష్యమైన వ్యవస్థను గాడిలో పెడుతున్నాయన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటివరకు 5 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణం చేశారన్నారు. అలాగే, ప్రతి బిడ్డకు రూ.15,000 ఇవ్వడం, తల్లులకు వందనం పథకం ద్వారా వారి నమ్మకాన్ని నిలబెట్టమన్నారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా కోట్ల మంది లబ్ధి పొందారు. రైతుల సంక్షేమం కోసం 'అన్నదాత సుఖీభవ' పథకంలో 47 లక్షల రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశామన్నారు. దీపం-2 పథకం ద్వారా ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తూ, ఇంట్లో వెలుగులు అందించడం సాధ్యమైందన్నారు.
వివరాలు
16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ
దీపం పథకం సూపర్ హిట్ గా నిలిచిందన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసామని తెలిపారు. ఈ సభకు, రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన తరువాత 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, అనేక కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.