Chandrababu: అదే జరిగితే.. 75 మంది మహిళలు అసెంబ్లీకి: చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
తమ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను కేంద్రబిందువుగా ఉంచామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపేర్కొన్నారు.
శాసనసభలో మాట్లాడుతున్న ఆయన, మహిళా సాధికారత మాటల్లోనే కాకుండా, చేతల్లో చూపించాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళా సాధికారతకు బాట వేసింది తెలుగుదేశం పార్టీయేనని తెలిపారు. మహిళలకు ఆస్తిలో హక్కును తొలి సారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తు చేశారు.
''తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు.అంతేకాదు,అప్పటికే ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతే ,తన తల్లి, చెల్లికి ఆస్తిలో హక్కును ఇవ్వకుండా వ్యవహరించారు.
మా పాలనలో తొలిసారిగా విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అందించాం.దీంతో మహిళలు మెరుగైన విద్యను అభ్యసించగలిగారు.
వివరాలు
దీపం-2 కింద 3 సిలిండర్లు ఉచితంగా
ప్రస్తుత పరిస్థితుల్లో కట్నం కూడా మహిళలకే ఇచ్చే స్థితి ఏర్పడింది.ఆడపిల్ల పుట్టినప్పుడు రూ.5,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ అందించాం.
స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాం.డీలిమిటేషన్ పూర్తయితే సుమారు 75 మంది మహిళలు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది.
పసుపు,కుంకుమ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.9,689 కోట్లు అందించాం.
మహిళలకు భద్రత, విశ్వాసాన్ని కలిగించామని నొక్కిచెప్పాను. తెలుగుదేశం పార్టీ అనేది తెలుగింటి ఆడబిడ్డల పార్టీ. 'దీపం-2' పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాం.
డ్వాక్రా మహిళలు రూపాయి పొదుపు చేస్తే, ప్రభుత్వంగా మేము కూడా రూపాయి సహాయం చేశాం. డ్వాక్రా సంఘాల మద్దతుతో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాం.
వివరాలు
అమరావతి బతికి ఉందంటే కారణం మహిళలు
రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూమిని అందించారు.
భూమి అనేది భావోద్వేగానికి సంబంధించిన విషయం, ఎవరూ సులభంగా దానం చేయరారు.
అయితే, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా, అమరావతి కోసం స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలు ఇచ్చారు.
రాజధాని ప్రాజెక్టు ఇంకా కొనసాగుతూ ఉందంటే, అందుకు కారణం మహిళలు చూపించిన అచంచలమైన నమ్మకమే!'' అని చంద్రబాబు పేర్కొన్నారు.