LOADING...
Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. యూరియా వాడకం తగ్గిస్తే రైతుకు రూ.800..
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. యూరియా వాడకం తగ్గిస్తే రైతుకు రూ.800..

Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. యూరియా వాడకం తగ్గిస్తే రైతుకు రూ.800..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2025
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

వ్యవసాయంలో యూరియాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ప్రాణాంతక క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే క్యాన్సర్ కేసులు అత్యంత ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని, యూరియాను నియంత్రణ లేకుండా వాడితే భవిష్యత్తులో గంభీరమైన పరిణామాలు ఎదురవ్వాల్సిన అవకాశముందని ఆయన హెచ్చరించారు. కలెక్టర్ల సమావేశంలో వ్యవసాయ రంగంపై చేసిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం క్యాన్సర్ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన టాప్-5 వ్యాధులలో ఒకటిగా ఉందని ఆయన గుర్తుచేశారు.

వివరాలు 

రైతులకు మైక్రో న్యూట్రియంట్స్‌ను సప్లిమెంట్లుగా ఇవ్వాలని సూచన 

రైతులు అధిక పంట దిగుబడి రావాలని ఆశపడి, యూరియాను నిర్ణీత పరిమితిని మించి ఉపయోగిస్తున్నారని, ఈ విధానం కొనసాగితే రాష్ట్రం క్రమంగా దేశంలోనే క్యాన్సర్ బాధితుల సంఖ్యలో మొదటి స్థానానికి చేరే అవకాశం ఉందని సూచించారు. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు యూరియా వాడకంపై రైతుల్లో విస్తృత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది నుంచి పంటలకు ఎంత అవసరమో అంతే పరిమాణంలో మాత్రమే యూరియాను వినియోగించేలా చూడాలన్నారు. అంతేకాకుండా, రైతులు పండ్లకు అవసరమైన సూక్ష్మ పోషకాలను (మైక్రో న్యూట్రియంట్స్) సప్లిమెంట్ల రూపంలో అందుకోవాలని కూడా స్పష్టంగా సూచించారు.

వివరాలు 

యూరియా దుష్ప్రభావాలపై పంజాబ్‌ను కేస్ స్టడీగా తీసుకోవాలన్న సీఎం 

యూరియాను ఎక్కువగా వాడితే పంట దిగుబడి పెరుగుతుందని భావించడం కేవలం అపోహ మాత్రమేని చంద్రబాబు నాయుడు చెప్పారు. యూరియాను అధికంగా వాడినప్పుడు కలిగే దుష్ప్రభావాలను అర్థం చేసుకోవడానికి పంజాబ్ రాష్ట్రాన్ని ఒక "కేస్ స్టడీ"గా పరిశీలించవలసిందిగా అధికారులకు సూచించారు.