Page Loader
Chandrababu: సంక్రాంతి నుంచి 'మీతో.. మీ చంద్రబాబు' కార్యక్రమం.. ప్రజలతో నేరుగా మాట్లాడనున్న సీఎం 
సంక్రాంతి నుంచి 'మీతో.. మీ చంద్రబాబు' కార్యక్రమం..

Chandrababu: సంక్రాంతి నుంచి 'మీతో.. మీ చంద్రబాబు' కార్యక్రమం.. ప్రజలతో నేరుగా మాట్లాడనున్న సీఎం 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2024
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' తరహాలోనే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలతో నేరుగా సంబంధం పెంచుకునేందుకు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. గతంలో 1995-2004 కాలంలో ఆయన 'డయల్ యువర్ సీఎం' పేరుతో ప్రజలతో నేరుగా మాట్లాడిన కార్యక్రమం ఎంతో ప్రాచుర్యం పొందింది. అదే దశలో ఇప్పుడు మన్ కీ బాత్ తరహా కార్యక్రమం, పాత డయల్ యువర్ సీఎం మేళవింపుతో ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ కార్యక్రమం ఆడియో లేదా వీడియో పద్ధతుల్లో నిర్వహించనున్నట్లు సమాచారం.

వివరాలు 

పోలవరం సందర్శనకు సిద్ధమవుతున్న సీఎం చంద్రబాబు 

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు ప్రగతిని పరిశీలించి, తరువాత నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలుపుతున్నాయి.