చంద్రయాన్ 3 శాటిలైట్ చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. చంద్రయాన్ 3 ని ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామని తెలిపారు.
చంద్రయాన్ 3 రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించినట్టు ఇస్రో ప్రకటించింది.
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రయాన్-3 దాదాపు 3 నుండి 3.84 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయనుంది.
పొలాల్లో పిట్టలను బెదరగొట్టేందుకు వడిసెలలో రాళ్ళు పెట్టి విసురుతారు. వడిసెలలో రాయిని తిప్పడం వల్ల డైరెక్టుగా కొట్టిన దాని కంటే ఎక్కువ దూరం వెళ్తుంది. ఇదే ప్రాసెస్ ని చంద్రయాన్-3 మిషన్ లో ఉపయోగిస్తున్నారు.
చంద్రయాన్-3 మిషన్ డైరెక్టుగా చంద్రుడి మీదకు కాకుండా భూమి కక్ష్యలో తిరుగుతూ తిరుగుతూ గురుత్వాకర్షణ కేంద్రం నుండి వేరు పడి చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుంది. అలా నెమ్మదిగా చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంది. ఈ టెక్నిక్ వల్లనే చంద్రయాన్-3 మిషన్ కు తక్కువ ఖర్చు అవుతుంది.
ఇంకో గంటలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుండి చంద్రయాన్ -3 లాంచ్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. నెట్టింట పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్ లో #Chandrayaan-3 భారత్ లోనే టాప్ లో ట్రెండ్ అవుతోంది. దానితోబాటు #ISRO, #WeAreComing కూడా ట్రెండ్ అవుతున్నాయి.
చంద్రయాన్ 3 ల్యాండర్‌కి విక్రమ్ అని, రోవర్‌కి ప్రగ్యాన్ అని పేరు పెట్టింది ఇస్రో.
ఇస్రో చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ లను జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ తీసుకెళుతోంది. వీటిలో కొన్ని ముడిభాగాలు హైదరాబాద్ కి చెందిన ఎయిర్ స్పేస్ అండ్ ప్రెసిసన్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోనే తయారయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కంపెనీ కూకట్ పల్లిలో ఉంది.
ఈ కంపెనీ ఎయిరోస్పేస్ రంగంలో కీలకమైన పరికరాలను తయారు చేస్తోంది. ఇస్రో గతంలో చేపట్టిన పలు ప్రాజెక్టుల్లోనూ ఈ కంపెనీ భాగస్వామిగా ఉంది.
1998 నుంచి ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన 50 శాటిలైట్ లలో పలు విడి భాగాలను తయారుచేసింది. అంతేకాకుండా తాజాగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టులో రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్స్‌లో బ్యాటరీలు ఏర్పాటు చేసుకునే విడి భాగాలను తయారుచేసిచ్చింది.
చంద్రయాన్-3 మిషన్ ని, ఆదిపురుష్ సినిమాను పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆదిపురుష్ బడ్జెట్(700కోట్లు) కంటే చంద్రయాన్-3 బడ్జెట్(615కోట్లు) తక్కువని పోస్టులు పెడుతున్నారు.
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చంద్రయాన్-3 మిషన్ ప్రారంభానికి ముందు ట్వీట్ చేశారు.
భారతదేశ అంతరిక్ష పరిశోధన రంగానికి సంబంధించినంత వరకు 14 జూలై 2023న బంగారు అక్షరాలతో లిఖించనుంది. చంద్రయాన్-3, మన మూడవ చంద్ర మిషన్, మరికాసేపట్లో దాని ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ అద్భుతమైన మిషన్ మన దేశపు ఆశలు, కలలను ముందుకు తీసుకువెళుతుందని ట్వీట్ చేశారు.
చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్
చంద్రయాన్-2తో పోలిస్తే చంద్రయాన్-3 బడ్జెట్ చాలా తక్కువ. చంద్రయాన్-2 మిషన్ బడ్జెట్ దాదాపు 978 కోట్ల రూపాయలు ఉంటే చంద్రయాన్-3 కేవలం 615 కోట్ల రూపాయలు. దినికి ప్రధాన కారణం అది ఆర్బిటర్‌ను ఉపయోగించకపోవడమే. ఆర్బిటర్‌కు బదులుగా.. ప్రొపల్షన్ మాడ్యూల్ ఉపయోగించబడింది.
చంద్రుడి దక్షిణ ధృవం మీద సూర్యకిరణాలు పడవు. ఈ కారణంగా ఆ ప్రాంతంలో చీకటి ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, పెద్ద పెద్ద బిలాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.
ఈరోజు లాంచ్ అయిన చంద్రయాన్-3 మిషన్, చంద్రుడి కక్ష్యలోకి చేరుకోవడానికి కనీసం 40రోజులు పడుతుంది. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే ఆగస్టు 24వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవం మీద ల్యాండ్ అవుతుంది.
ప్రఖ్యాత సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్, ఒడిస్సాలోని పూరీ తీరంలో చంద్రయాన్-3 సైకత శిల్పాన్ని రూపొందించి విజయం చేకూరాలని ఆకాంక్షించారు.
ప్రఖ్యాత సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్, ఒడిస్సాలోని పూరీ తీరంలో చంద్రయాన్-3 సైకత శిల్పాన్ని రూపొందించి విజయం చేకూరాలని ఆకాంక్షించారు.
చంద్రయాన్ 3 కి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను ఇస్రో గురువారం మధ్యాహ్నం 1.05 నిమిషాలకు ప్రారంభించింది. చంద్రయాన్-3 చాలా కష్టమైన ప్రయోగం. అమెరికా, రష్యా, చైనా సహా మరే దేశమూ ఇప్పటిదాకా చంద్రుడిని చేరుకోలేకపోయాయి. దక్షిణ ధ్రువానికి చేరువవడాన్ని ఈ ప్రయోగంలో భారత్ తన లక్ష్యంగా విధించుకుంది.
2019 జూలై 22న చేపట్టిన చంద్రయాన్-2 ని చంద్రుడిపై రోవర్‌ను దింపే లక్ష్యంతో ప్రయోగించారు. కానీ ఈ మిషన్ విఫలమైంది. ఈ వైఫల్యంతో ఇస్రో.. తన లోపాలను సవరించుకొని తాజాగా చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండర్ దిగుతుంది.
చంద్రయాన్-2 తరువాత ఇస్రో మరో చారిత్రక ఘట్టానికి భారత్ సన్నద్ధమవుతోంది. నేడు ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుండి చంద్రయాన్ 3.. లాంచ్కానుంది. మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు నింగిలోకి లాంచ్ అవ్వనుంది.