Page Loader
Aadhaar Update : ఆధార్ కార్డులో మార్పులు ఇక ఇంటి వద్ద నుంచే.. ఎప్పుడంటే?
ఆధార్ కార్డులో మార్పులు ఇక ఇంటి వద్ద నుంచే.. ఎప్పుడంటే?

Aadhaar Update : ఆధార్ కార్డులో మార్పులు ఇక ఇంటి వద్ద నుంచే.. ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 07, 2025
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆధార్ కార్డ్ లో ఏవైనా పొరపాట్లు ఉన్నాయా? ఇకపై వాటిని సవరించుకోవాలంటే సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే సులభంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం కలుగుతుంది. నవంబర్ 2025 నుంచి ఆధార్ డేటా ఆన్‌లైన్ అప్‌డేట్ సదుపాయం మరింత విస్తృతంగా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే UIDAI (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) myAadhaar పోర్టల్‌ ద్వారా కొన్ని వివరాలను మార్చుకునే అవకాశం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలో మరిన్ని వివరాలను ఇంటి నుంచే అప్‌డేట్ చేసుకునే వీలుంటుంది.

Details

కొత్త మార్పులతో ఏయే సౌకర్యాలు వస్తున్నాయంటే..

పేరు స్పెల్లింగ్ సవరణ, చిన్నపాటి మార్పులు నేరుగా ఆన్‌లైన్‌లో చేయొచ్చు. పుట్టిన తేదీ మార్పు పరిమితిని విస్తరించనున్నారు. తండ్రి / భర్త / భార్య పేర్లు వంటి కుటుంబ సభ్యుల వివరాలు కూడా డిజిటల్‌గా మార్చుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్ ఆధార్ ఆధారంగా అడ్రస్ మార్చుకునే సదుపాయం లభించనుంది. మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ అప్‌డేట్ చేయడం కూడా డిజిటల్ రూపంలోనే జరగనుంది. ప్రస్తుతం ఈ మార్పుల కోసం ఆధార్ సేవా కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తున్నా.. నవంబర్‌ తర్వాత వాటిని myAadhaar పోర్టల్‌ ద్వారానే పూర్తిచేయొచ్చు.

Details

ఆన్‌లైన్ అప్‌డేట్ ప్రక్రియ ఎలా జరుగుతుంది?

1. myAadhaar పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. 2. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPను ఎంటర్ చేయాలి. 3. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. 4. వెరిఫికేషన్ అనంతరం, వివరాలు అప్‌డేట్ అవుతాయి. 5. అవసరమైతే వీడియో వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. 6. అప్‌డేట్ అయిన ఆధార్‌ను డిజిటల్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. UIDAI ప్రకారం 3-5 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే పేరులో, పుట్టిన తేదీలో పెద్ద మార్పులకు విడియో వెరిఫికేషన్ అవసరం అవుతుంది.

Details

కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి

అప్‌లోడ్ చేసే డాక్యుమెంట్లు క్లియర్‌గా, సరైనవి ఉండాలి. తప్పుడు సమాచారం / ఫేక్ డాక్యుమెంట్లు ఇస్తే అప్లికేషన్ తిరస్కరించబడుతుంది, ఆధార్ తాత్కాలికంగా సస్పెండ్ అవుతుంది. బయోమెట్రిక్ వివరాల మార్పు కోసం మాత్రం సేవా కేంద్రానికి వెళ్లాల్సిందే. నవంబర్ నాటికి ఆమోదించిన డాక్యుమెంట్ల జాబితా, మార్గదర్శకాలు విడుదల చేయనున్న UIDAI. ప్రస్తుతం దేశంలో 140 కోట్లకు పైగా ఆధార్ నంబర్లు జారీ అయ్యాయి. కోవిడ్‌ తర్వాత డిజిటల్ సేవల అవసరం పెరగడంతోUIDAIఈ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర పథకాలు, బ్యాంకింగ్, మొబైల్ సర్వీసులు వంటి అన్ని రంగాలలో ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇకపై ఆధార్ డేటా మార్పులు కోసం రద్దీకి లోనయ్యే అవసరం లేదు. ఇంటి నుంచే సులభంగా వివరాల మార్పు చేయొచ్చు!