
Chennai Airport: బాంబు బెదిరింపులతో కలకలం: చెన్నై ఎయిర్‌పోర్టులో హై అలర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
చెన్నై ఎయిర్‌పోర్టులో శనివారం అర్ధరాత్రి హై టెన్షన్ పరిస్థితి నెలకొంది. టేకాఫ్ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ వద్ద బాంబు బెదిరింపులకు పాల్పడి, దానిని పేల్చేస్తామంటూ హెచ్చరించారు.
ఈ ఘటనతో తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
చెన్నై ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు క్షుణ్ణంగా చేపట్టి, బాంబు లేదని నిర్ధారించారు.
బాధ్యులైన ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కొచ్చి నుంచి చెన్నైకి బయల్దేరిన ఇండిగో విమానంలో మొత్తం 171 మంది ప్రయాణికులున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి, అమెరికా, కేరళకు చెందిన ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ చోటు చేసుకుంది.
Details
గొడవకు కారణమైన ప్రయాణికులను విచారిస్తున్న పోలీసులు
వారు పరస్పరం దాడులు చేసుకోవడమే కాకుండా, తమ వద్ద బాంబు ఉందని భయాందోళన కలిగించేలా మాట్లాడారు.
ఈ ప్రవర్తనతో తోటి ప్రయాణికులు తీవ్ర భయానికి గురయ్యారు. ఈ పరిస్థితిని గమనించిన పైలెట్లు వెంటనే చెన్నై భద్రతా అధికారులకు సమాచారం అందించారు.
ఈ విమానంలో బాంబు ఉందన్న సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
చెన్నై ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయిన వెంటనే దాదాపు తెల్లవారుజామున ఐదు గంటల వరకు అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించి, బాంబు లేదని ధృవీకరించారు.
గొడవకు కారణమైన ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.