Page Loader
ప్రియురాలిని గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని ఏం చేశాడంటే? 
ప్రియురాలిని హత్య చేసి.. మృతదేహాన్ని వాట్సాప్ స్టేటస్‌ పెట్టాడు

ప్రియురాలిని గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని ఏం చేశాడంటే? 

వ్రాసిన వారు Stalin
Dec 02, 2023
07:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

Chennai Man kills girlfriend: చెన్నైలోని ఓ హోటల్‌లో దారుణ హత్య జరిగింది. 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిని ఆమె ప్రియుడు హత్య చేసి, మృతదేహాన్ని తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టాడు. నిందితుడిని ఆషిక్‌గా, బాధితురాలిని ఫౌసియాగా గుర్తించారు. ఆషిక్‌ వాట్సాప్ స్టేటస్‌ను ఫౌసియా స్నేహితులు గుర్తించడంలో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఇద్దరూ బస చేసిన హోటల్ గదికి వెళ్లి, యువతి మృతదేహాన్ని గుర్తించారు. యువతి నర్సింగ్ రెండో సంవత్సరం చదవుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఐదేళ్లుగా ఆషిక్‌-యువతి ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

చెన్నై

రహస్యంగా పెళ్లి!

ఫౌసియా నర్సింగ్‌ ద్వితీయ సంవత్సరం చదవుతోంది. ప్రస్తుతం న్యూకాలనీలోని హాస్టల్‌లో ఉంటోంది. ఆషిక్‌, ఫౌసియా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు 'ఇండియా టూడే' వెబ్ సైబ్ నివేదించింది. గతంలో ఇద్దరు చెన్నైలో ఓ గదిని అద్దెకు తీసుకుని కలిసి ఉన్నట్లు సమాచారం. పోలీసులు సీసీటీవీ ఫుటేజీల సహాయంతో ఆషిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరం చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వేరే మహిళతో సంబంధం ఉన్నట్లు ఫౌసియా ఆరోపించడంతో ఇద్దరి మధ్య గొడవ తలెత్తినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి, ఆషిక్‌ ఆవేశంతో ఫౌసియా గొంతుకోసి హత్య చేసినట్లు చెప్పారు.