Page Loader
ప్రియుడిని హత్య చేసి, ముక్కలను ఇసుకలో పాతిపెట్టిన సెక్స్ వర్కర్
చెన్నై: ప్రియుడిని హత్య చేసి, శరీర భాగాలను ఇసుకలో పాతిపెట్టిన సెక్స్ వర్కర్

ప్రియుడిని హత్య చేసి, ముక్కలను ఇసుకలో పాతిపెట్టిన సెక్స్ వర్కర్

వ్రాసిన వారు Stalin
Apr 04, 2023
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నైలోని ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్‌లో ఉద్యోగం చేస్తున్న 29ఏళ్ల యువకుడిని అతని ప్రియురాలు హత్య చేసింది. ఈ ఘటన పుదుకోట్టైలో జరిగింది. మృతదేహాన్ని ముక్కలుగా నరికి, శరీర భాగాలను ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి మార్చి 20న కోవలంలో చేతులను విసిరేశారు. మార్చి 26న మళ్లీ కోవలం వచ్చి మిగిలిన ముక్కలను ఇసుకలో పాతిపెట్టారు. చనిపోయిన యువకుడిని విల్లుపురానికి చెందిన ఎం.జయంతన్‌గా గుర్తించారు. 2020లో సెక్స్ వర్కర్ అయిన భాగ్యలక్ష్మి (38)తో జయంతన్‌‌కు శారీరక సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అనంతరం జయంతన్ తన కుటుంబ సభ్యులకు తెలియకుండా విల్లుపురం సమీపంలోని మైలమ్‌లోని ఓ ఆలయంలో భాగ్యలక్ష్మికి జయంతన్ 'తాళి' కట్టాడు. 2021లో ఈ జంట విడిపోయింది.

తమిళనాడు

సోదరి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన

హత్య జరగడానికి ముందురోజు జయంతన్‌ తమ స్వగ్రామం విల్లుపురానికి వెళ్తున్నట్లు అందరికి చెప్పారు. ఇదే సమయంలో జయంతన్‌ సోదరి అతడికి ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అమెకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో జయంతన్‌ స్వగ్రామానికి పోలేదని తెలుసుకున్న అతని సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఫోన్‌ రికార్డుల ఆధారంగా భాగ్యలక్ష్మిని విచారించగా ఆమె హత్య చేసినట్లు ఒప్పుకుంది. జయంతన్‌ను పుదుక్కోట్టైలోని తన ఇంటికి పిలిచినట్లు భాగ్యలక్ష్మి వెల్లడించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగ్గా, తన ముగ్గురు స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది.