Page Loader
నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు 
నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు

నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 13, 2023
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌ కొత్త ముఖ్యమంత్రులుగా మోహన్‌ యాదవ్‌,విష్ణు దేవ్‌సాయి బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యప్రదేశ్‌ రాజధానిలోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమంలో మోహన్ యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా,విష్ణు సాయి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో ప్రమాణం చేయనున్నారు. రెండు చోట్లా జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. రాజేంద్ర శుక్లా,జగదీష్ దేవదా మధ్యప్రదేశ్‌కు ఉప ముఖ్యమంత్రులు.కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని 230అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో నవంబర్ 17న పోలింగ్ జరగగా,డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగింది.

Details 

గ్రామసర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన విష్ణు దేవ్ సాయి 

దాదాపు 20 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారం కోసం పోరాడుతున్న బీజేపీ 163స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 66 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో ఆదివారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బీజేపీ నేత రమణ్ సింగ్ తదుపరి ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయి పేరును ప్రకటించారు. విష్ణు దేవ్ సాయి గ్రామసర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.1989లో బాగియా గ్రామ పంచాయతీకి'పంచ్'గా ఎన్నికై, మరుసటి సంవత్సరం ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1999 నుండి 2014 వరకు రాయ్‌గఢ్ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో విష్ణు దేవ్ గెలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు.ఛత్తీస్‌గఢ్‌లోని 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ 54,కాంగ్రెస్ 35 స్థానాలు గెలుచుకుంది.