
Chicken Shawarma-Hospitalised-Mumbai: ముంబైలో చికెన్ షావర్మా తిని ఆసుపత్రి పాలైన 12 మంది
ఈ వార్తాకథనం ఏంటి
ముంబై(Mumbai)లో చికెన్ షావర్మా(Chicken Shawarma)తిని 12 మందికి పైగా ఆసుపత్రి (Hospital)పాలయ్యారు.
ముంబైలోని గోరెగావ్(Goregaon)లోని నాన్ వెజిటేరియన్ స్ట్రీట్ ఫుడ్ లో కొంతమంది చికెన్ షావర్మా తిన్నారు.
దీంతో వారంతా అస్వస్థతకు లోనయ్యారు.
అస్వస్థతకు లోనైన వీరందరిని వారి కుటుంబ సభ్యులు ముంబైలోని ఆసుపత్రిలో చేర్చారు.
వీరిలో 9 మందిని చికిత్స అనంతరం కోరుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
కొంతమంది కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు.
రెండు రోజుల్లోనే 12 మందికి పైగా అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో చేరడంతో బీఎంసీ అప్రమత్తమయ్యింది.
గోరేగావ్ లోని సంతోష్ నగర్ ఏరియాలోని శాటిలైట్ టవర్ వద్ద ఉన్న చికెన్ షాప్ దుకాణంలో షావర్మా తిన్నట్టు బాధితులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చికెన్ షావర్మా తిని ఆసుపత్రి పాలైన 12 మంది
12 Hospitalised After Eating Chicken Shawarma In Mumbai https://t.co/ncPDxeuy9a pic.twitter.com/ohbbyo7HKo
— Social News Daily (@SocialNewsDail2) April 29, 2024