Page Loader
మే నెల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం: మాజీ సీఎం 
మే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం: మాజీ సీఎం

మే నెల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం: మాజీ సీఎం 

వ్రాసిన వారు Stalin
Dec 11, 2023
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం, జేడీఎస్ హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) సంచలన కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో ఉండదన్నారు. మే ​​నాటికి ఈ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని కుమారస్వామి జోస్యం చెప్పారు. కేఆర్ పేట్ తాలూకా బెలత్తూరు గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వం చేస్తున్న కొన్ని కార్యక్రమాల వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత 50మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారన్నారు. దేవెగౌడ తన జీవితాన్ని పేదల అభివృద్ధి కోసం అంకితం చేశారన్నారు. ఆయన ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం పనిచేశామన్నారు. తమ హయాంలో పాలన ఎక్కడా దారి తప్పలేదన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

50మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి: కుమారస్వామి