Neha Hiremath-Murder-row: అండగా ఉంటాం: నిరంజన్ హిరేమత్ కు అభయమిచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
కర్ణాటకలో కంప్యూటర్ విద్యార్థి నేహా హిరేమత్(Neha Hiremath) దారుణ హత్య రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. సోమవారం నేహా తండ్రి నిరంజన్ హిరేమత్ (Niranjan Hiremath) ను బీజేపీ అధ్యక్షుడు (Bjp president) జేపీ నడ్డా (JP Nadda) ఇంటికి వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి (CM) సిద్ధరామయ్య (Siddha Ramaiah) నిరంజన్ హిరేమత్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నిరంజన్ హిరేమత్ కు అండగా ఉంటామన్నారు. మంగళవారం తొలుత అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్ కె పాటిల్ (H.K.Patil) నిరంజన్ హీరే మత్ తో భేటీ అయ్యారు.
సీబీఐ విచారణకు ఆదేశిస్తాం: సీఎం సిద్ధరామయ్య
అనంతరం ముఖ్యమంత్రి సిద్దరామయ్య హిరేమత్ కు ఫోన్ చేసి పార్టీ అంతా మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను వదిలేది లేదని స్పష్టం చేశారు. నేహా హీరేమత్ మృతికి విచారం వ్యక్తం చేశారు. నేహా హత్యపై సీబీఐ విచారణ చేయిస్తామని అవసరమైతే ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేస్తామని సీఎం సిద్ధరామయ్య హామీనిచ్చారు. సాధ్యమైనంత త్వరలో న్యాయం జరిగేలా చూస్తామని నిరంజన్ హీరేమత్ కు చెప్పారు.