Page Loader
Scarlet fever: పిల్లలు జాగ్రత్త.. హైద‌రాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న స్కార్లెట్ ఫీవ‌ర్ కేసులు
పిల్లలు జాగ్రత్త.. హైద‌రాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న స్కార్లెట్ ఫీవ‌ర్ కేసులు

Scarlet fever: పిల్లలు జాగ్రత్త.. హైద‌రాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న స్కార్లెట్ ఫీవ‌ర్ కేసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2025
05:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ నగరంలో సీజనల్‌ వ్యాధులతో పాటు స్కార్లెట్‌ జ్వరం కేసులు పెరిగిపోతున్నాయని పిల్లల డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఐదేండ్ల నుంచి 15 ఏండ్ల పిల్లలు ఈ జ్వరం బారిన పడుతున్నారని, ఈ సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గొంతునొప్పి, తీవ్ర జ్వరం, దద్దుర్లు ఉంటే బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ ఉంటుందని, ఈ ఇన్ఫెక్షన్‌ స్ట్రెప్టోకొక్కై అనే బ్యాక్టీరియాతో సంబంధం కలిగి ఉందని వైద్యులు చెప్పారు. ఈ బ్యాక్టీరియాతో వచ్చే జ్వరాన్ని స్కార్లెట్‌ ఫీవర్‌ అంటారు. స్కార్లెట్‌ ఫీవర్‌ లక్షణాలు తీవ్ర జ్వరం, నోరు పొక్కిపోవడం, గొంతులో మంట, నాలుక ఎర్రగా కందిపోవడం (స్ట్రాబెర్రీ టంగ్‌), నీరసం, మరియు ఆహారం తినాలనిపించకపోవడం.

Details

మాస్కులు ధరించాలి

వైద్యులు, ఈ లక్షణాలు రెండు లేదా ఐదు రోజుల్లో కనిపిస్తాయన్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలన్నారు. సరిగ్గా యాంటీ బయాటిక్స్‌ వాడితే ప్రమాదకరం కాదు. సరైన చికిత్స లేకపోతే గుండె, కిడ్నీలపై ప్రభావం పడవచ్చు, రుమాటిక్‌ ఫీవర్‌, నెఫ్రైటిక్‌ సిండ్రోమ్‌లకు దారితీయవచ్చు. ఈ జ్వరానికి తర్వాత బిడ్డలో ఆయాసం, గుండెదడ, ముఖం వాచిపోవడం, మూత్రం తగ్గిపోవడం, మూత్రంలో రక్తం వంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచించారు. స్కార్లెట్‌ ఫీవర్‌ ఒక అంటువ్యాధి. ఈ జ్వరంతో బాధపడేవారు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఆహారం, నీరు, ఇతర పదార్థాలు ఉపయోగించకూడదు. ముక్కు, నోరు కవర్‌ అయ్యేలా మాస్కు ధరించడం ఉత్తమమని వైద్యులు చెప్పారు.