China : 'కేంద్రం కీలక ప్రకటన.. చైనాలో ఫ్లూ కేసులపై మనకు ముప్పేమీ లేదు'
న్యుమోనియా కలకలంతో డ్రాగన్ చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అక్కడి చిన్నారులు ఊపిరి పీల్చుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆస్పత్రులు బాధితులతో నిండిపోతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై భారత్ కీలక ప్రకటన చేసింది. ఫ్లూ కేసులు పెరగడంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించామని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపింది. భారతదేశంపై ఈ ముప్పు ఏమీ ఉండబోదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి భారతీయులకు దీనిపై ఆందోళన అవసరం లేదని, ఒకవేళ విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది. చైనాలో ఈ తరహా కేసులు పెరుగుతుండటం ప్రపంచ దేశాలనూ వణికిస్తోంది. ప్రస్తుతానికి చైనాలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ను H9N2గా గుర్తించారు. Avian influenza virusగా పిలుస్తున్నారు.
వైద్య అధికారులను అప్రమత్తం చేసిన కేంద్రం.
చైనాలో కేసులు పెరిగిన వెంటనే డెరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ (DGHS) ప్రత్యేకంగా సమావేశమైంది. భారత్‌లో ఫ్లూ వ్యాపిస్తే ఎలా కట్టడి చేయాలో చర్చించింది.మనిషి నుంచి మనిషికి సోకే అవకాశాలు లేవని, మరణాల రేటు సైతం తక్కువేనని అభిప్రాయపడింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు H9N2 కేసులను పరిశీలిస్తోందని, ప్రస్తుతానికి భారత్‌కి వచ్చిన ముప్పేమీ లేదని పేర్కొంది. మనుషుల నుంచి జంతువులకు ఈ వైరస్ సోకుతుందా లేదా అన్నదానిపై కేంద్రం, వైద్య అధికారులను అప్రమత్తం చేసింది. మరోవైపు చైనా విషయంలో కొవిడ్ తర్వాత ఆ స్థాయిలో ఆరోగ్య అత్యవరస స్థినిని చైనా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే దేశంలోని స్కూల్స్‌లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో కెపాసిటీకి మించి బాధితులు చేరుతున్నారు.