Page Loader
జీ20 సదస్సుకు వచ్చిన చైనా ప్రతినిధుల బ్యాగుల్లో నిఘా పరికరాలు? 
జీ20 సదస్సుకు వచ్చిన చైనా ప్రతినిధుల బ్యాగుల్లో నిఘా పరికరాలు?

జీ20 సదస్సుకు వచ్చిన చైనా ప్రతినిధుల బ్యాగుల్లో నిఘా పరికరాలు? 

వ్రాసిన వారు Stalin
Sep 14, 2023
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీ20 సదస్సు కోసం దిల్లీకి వచ్చిన చైనా ప్రతినిధి బృందం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగులపై మరో అప్టేట్ వచ్చింది. చైనా ప్రతినిధులు వద్ద అనుమాస్పదంగా కనిపించిన బ్యాగులు రెండు కాదని, 20 అని టైమ్స్ అఫ్ ఇండియా నివేదిక చెబుతోంది. అందులో నిఘా పరికరాలు ఉండొచ్చని ఇంటలీజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో బస చేసిన ఆరుగురు చైనా అధికారుల బృందం ఆ రహస్యమైన బ్యాగ్‌లను తీసుకొచ్చింది. ఆ బ్యాగులు చూడటానికి చాలా పెద్దవిగా ఉన్నాయని, 1x1 మీటర్ పొడవు, వెడల్పుతో పాటు 10 అంగుళాల మందం ఉన్నాయని నివేదిక చెప్పింది.

చైనా

బ్యాగుల కూపీలాగే పనిలోని నిఘా వర్గాలు

ఆ బ్యాగులను తనిఖీ చేయడానికి చైనా బృందం నిరాకరించింది. దీంతో బ్యాగుల్లో ఏముందో తనిఖీ చేయనివ్వకుండా చైనా ప్రతినిధులు వాటిని చైనా రాయబార కార్యాలయానికి తరలించారు. దీంతో ఆ బ్యాగ్‌లలో ఏమి దాచిపెట్టారో మిస్టరీగానే మారింది. భారత ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం ఆ బ్యాగుల కూపీ లాగే పనిలో నిమగ్నమయ్యారు. అందులో నిఘా పరికరాలు ఉన్నాయా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ బ్యాగుల వ్యవహారంపై మాత్రం చైనా మౌనం వహిస్తోంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా నేతృత్వంలోని జీ20 ప్రతినిధి బృందం కూడా చైనా ప్రతినిధులు బస చేసిన తాజ్ ప్యాలెస్ హోటల్‌లోనే బస చేశారు. దీంతో వారి బ్యాగుల్లో చైనా ఏమైనా నిఘా పరికరాలను పెట్టిందా? అనే కోణంలో విచారిస్తున్నారు.