Page Loader
Land Titling Act: చంద్రబాబు, నారా లోకేష్‌లపై సీఐడీ కేసు నమోదు 
Land Titling Act: చంద్రబాబు, నారా లోకేష్‌లపై సీఐడీ కేసు నమోదు

Land Titling Act: చంద్రబాబు, నారా లోకేష్‌లపై సీఐడీ కేసు నమోదు 

వ్రాసిన వారు Stalin
May 05, 2024
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూ పట్టాపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై నేర పరిశోధన విభాగం(సీఐడీ)కేసు నమోదు చేసింది. వీరిద్దరూ తప్పుడు సమాచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చంద్రబాబు,లోకేష్‌లు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని సీఐడీ ప్రమేయానికి ముందే వైసీపీ ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. ఈసీ ఆదేశాల మేరకు సీఐడీ విచారణ చేపట్టి ఏ1గా చంద్రబాబు,ఏ2గా లోకేష్‌పై ఎఫ్‌ఐఆర్‌నమోదు చేసింది. ఈనేతలు చేస్తున్న బూటకపు ప్రచారాన్ని సీఐడీ దర్యాప్తు చేసి,వారి ప్రమేయం ఏ మేరకు ఉందో తేల్చనుంది. ఈ విషయమై చంద్రబాబు,లోకేశ్‌లు ఆరోపణలను ఖండించారు.విచారణకు అధికారులకు సహకరిస్తామని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీడీపీ ఫెక్ ప్రచారంపై సీఐడీ విచారణ