LOADING...
Ponguleti Srinivas Reddy: నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల తేదీపై స్పష్టత.. మంత్రి పొంగులేటి 
నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల తేదీపై స్పష్టత.. మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy: నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల తేదీపై స్పష్టత.. మంత్రి పొంగులేటి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులోగా విడుదల కానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం జరగనున్న రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశం అనంతరం ఎన్నికల తేదీలపై స్పష్టత వచ్చేస్తుందని వెల్లడించారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనంతరం సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని చెప్పారు.

Details

కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉండాలి

స్థానిక సంస్థల ఎన్నికలకు కేవలం 15 రోజుల సమయమే ఉన్నందున, కాంగ్రెస్‌ శ్రేణులు ఇప్పుడే సిద్ధంగా ఉండాలని సూచించారు. గెలిచే అవకాశాలున్న అభ్యర్థులకే టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక వారం రోజుల్లో 'రైతు భరోసా' నిధులు, సన్న రకానికి బోనస్‌ లభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని, ప్రజలతో నిత్యం మమేకమవుతూ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు.