Telangana: తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 04, 2026
08:27 am
ఈ వార్తాకథనం ఏంటి
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ వసతిగృహంలో మంగళవారం అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హోలీ సంబరాలు ముగిసిన తరువాత సీనియర్,జూనియర్ విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు దిగారు. ఈ గొడవలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న వర్సిటీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన విద్యార్థులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఆంజనేయులు, వసతిగృహ వార్డెన్ డాక్టర్ యాలాద్రి హాస్టల్‌కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై విచారణ జరిపిన తర్వాత బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.