LOADING...
Restaurant Staff: జైపూర్‌లో రెస్టారెంట్‌లో ఘర్షణ.. వీడియో వైరల్! 
జైపూర్‌లో రెస్టారెంట్‌లో ఘర్షణ.. వీడియో వైరల్!

Restaurant Staff: జైపూర్‌లో రెస్టారెంట్‌లో ఘర్షణ.. వీడియో వైరల్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2025
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లోని జైపూర్‌ (Jaipur)లో ఆదివారం రాత్రి ఓ షాకింగ్‌ ఘటన జరిగింది. నహర్‌గఢ్ హిల్స్‌లో (Nahargarh Hills) ఉన్న ప్రముఖ పడావో రెస్టారెంట్‌ (Padao Restaurant)‌లో సీటు రిజర్వేషన్‌ విషయంలో కస్టమర్లు (Customers), రెస్టారెంట్‌ సిబ్బంది (Staff) మధ్య జరిగిన వాగ్వాదం చివరికి ఘర్షణకు (Fight) దారి తీసింది.

Details

ఏం జరిగింది?

సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రెండు జంటలు డిన్నర్ కోసం రెస్టారెంట్‌కు వచ్చారు. వారు ముందుగా బుక్‌ చేసుకున్న సీటు విషయంలో హోటల్‌ సిబ్బందితో వాగ్వాదం ప్రారంభమైంది. కొద్దిసేపటిలో ఆ వాగ్వాదం తీవ్రరూపం దాల్చి, ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థితికి చేరాయి. ఘర్షణలో ఇద్దరు మహిళలు సహా దాదాపు 15 మంది పాల్గొన్నట్లు సమాచారం. రెస్టారెంట్‌ సిబ్బంది తమపై వేధింపులు చేశారని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కస్టమర్లే దాడికి దిగారని రెస్టారెంట్‌ సిబ్బంది కూడా ఫిర్యాదు చేశారు.

Details

పోలీసు కేసు

ఈ ఘటనపై పోలీసులు రెండు ఫిర్యాదులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ఈ పడావో రెస్టారెంట్‌ రాజస్థాన్ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో