
Tamilnadu: తమిళనాడులో విద్యార్థుల మధ్య పెన్సిల్ గొడవ.. తోటి విద్యార్థిని కొడవలితో నరికి చింపేసిన మరో స్టూడెంట్..
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లా పాలయంగోట్టైలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పెన్సిల్ కోసం మొదలైన చిన్న గొడవ, చివరకు తీవ్ర విషాద సంఘటనగా మారింది.
ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన మాటామాటానికి తీవ్రమైన మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
పెన్సిల్ విషయంలో చిన్నపాటి వివాదం రాజుకుంది. గత కొన్ని రోజులుగా పరస్పరం మాట్లాడుకోకుండా ఉన్న ఇద్దరు విద్యార్థుల మధ్య, ఇదే విషయంపై ఈరోజు మళ్లీ వాగ్వాదం జరిగింది.
ఈ నేపథ్యంలో, ఒక విద్యార్థి కోపానికి లోనై, వెంట తీసుకుని వచ్చిన కొడవలితో తన స్నేహితుడిపై దాడి చేసి, అతి దారుణంగా హతమార్చాడు.
వివరాలు
అదుపులోనిందితుడైన విద్యార్థి
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
నిందితుడైన విద్యార్థిని అదుపులోకి తీసుకుని జువెనైల్ న్యాయస్థానానికి హాజరుపరిచారు. హత్యకు గురైన విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా, మృత విద్యార్థి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.