Kerala: కేరళ పాఠశాలలో కాల్పులు.. 9వ తరగతి విద్యార్థికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో పాఠశాలలో తుపాకీ పేలిన ఘటన కలకలం రేపింది. ఓ విద్యార్థి పాఠశాలకు తీసుకొచ్చిన నాటు తుపాకీ అనుకోకుండా పేలడంతో తొమ్మిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి గాయపడ్డాడు. తిరుత్తాల సమీపంలోని పరుత్తూర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఉదయం 11.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తుపాకీ పేలడంతో విద్యార్థి చంక భాగంలో, భుజం నుంచి చేయి మధ్య గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది అతడిని చికిత్స కోసం కొట్టక్కల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే విద్యార్థికి అయిన గాయం తీవ్రంగా లేదని తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు.
వివరాలు
పాఠశాలలోకి తుపాకీ ఎలా వచ్చింది?
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఓ విద్యార్థి తుపాకీని పాఠశాలకు తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు.
అది నాటు తుపాకీ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. అసలు ఆ తుపాకీ విద్యార్థికి ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని పాఠశాలలోకి ఎలా తీసుకొచ్చాడు? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మరోవైపు తుపాకీ ఏ పరిస్థితుల్లో పేలింది? కాల్పులకు దారితీసిన కారణాలేంటి? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నాటు తుపాకీ పేలడంతో విద్యార్థికి గాయాలు
Class 9 student injured after gun goes off at school in Keralam
— News18 (@CNNnews18) November 24, 2026
Police suspect the weapon was a country-made gun and are investigating how it was brought to the govt school in Palakkad@Neethureghu with more details#Kerala #Palakkad #SchoolIncident #student | @aakaaanksha pic.twitter.com/R4TNG8l8Fe