తదుపరి వార్తా కథనం

Telangana SC Act : తెలంగాణలో ఎస్సీ కులాల వర్గీకరణ.. ప్రభుత్వ జీవో విడుదల!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 14, 2025
12:36 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
దీంతో ఇప్పటివరకు ఒకే విధంగా అమలైన రిజర్వేషన్లు ఇకపై వర్గీకరణ ప్రకారం అందించనున్నారు.
రాష్ట్రంలో 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించారు.
A గ్రూప్ : 15 ఉపకులాలు - 1% రిజర్వేషన్లు
B గ్రూప్ : 18 కులాలు - 9% రిజర్వేషన్లు
C గ్రూప్ : 26 కులాలు - 5% రిజర్వేషన్లు
ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను ఈ గ్రూపుల ప్రాధాన్యత ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఈ గెజిట్‌ను తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంచామని ప్రభుత్వం వెల్లడించింది.