LOADING...
Mohammed Shami: మహ్మద్ షమీ ఉపవాసం పాటించకపోవడంపై..ఆగ్రహం వ్యక్తం చేసిన ముస్లిం సమాజం 
మహ్మద్ షమీ ఉపవాసం పాటించకపోవడంపై..ఆగ్రహం వ్యక్తం చేసిన ముస్లిం సమాజం

Mohammed Shami: మహ్మద్ షమీ ఉపవాసం పాటించకపోవడంపై..ఆగ్రహం వ్యక్తం చేసిన ముస్లిం సమాజం 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2025
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ స్టార్ మహ్మద్ షమీ పై ముస్లిం మత పెద్ద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన చేసిన ప్రకటన ప్రకారం,అల్లా తప్పకుండా షమీని శిక్షిస్తాడని తెలిపారు. ఇటీవల ఆసీస్‌తో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో మహ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ తాగిన ఘటనపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఒకవీడియో విడుదల చేసిన ఆయన,రంజాన్ ఉపవాస కాలంలో ముస్లింలు రోజా (ఉపవాసం)పాటించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ముస్లిం పురుషుడు,స్త్రీ రోజా పాటించాల్సి ఉంటుందని,ఖురాన్ ప్రకారం దీనిని అతిక్రమించిన వారు పెద్ద నేరస్తులుగా పరిగణించబడతారని తెలిపారు.

వివరాలు 

బహిరంగంగా ఎనర్జీ డ్రింక్ తాగడంపై రజ్వీ మండిపాటు 

భారత క్రికెట్‌లో పేరుగాంచిన షమీ మ్యాచ్ సమయంలో ఎనర్జీ డ్రింక్ తాగడాన్ని ఆయన తప్పుపట్టారు. షమీ శారీరకంగా పూర్తిగా ఆరోగ్యవంతుడైనప్పటికీ, ఉపవాసాన్ని పాటించకుండా బహిరంగంగా ఎనర్జీ డ్రింక్ తాగడం తగదని మౌలానా షాబుద్దీన్ రజ్వీ మండిపడ్డారు. షరియత్ ప్రకారం ఇది తప్పు, షమీ ఒక నేరస్తుడని, అల్లా తప్పకుండా అతన్ని శిక్షిస్తాడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా, షమీ అభిమానులతో పాటు అనేకమంది క్రికెట్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. "మతాన్ని క్రీడలతో కలపకూడదు" అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. షమీ విజయాలను ముస్లిం సమాజం కూడా గర్వించాల్సిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మౌలానా షాబుద్దీన్ రజ్వీ వీడియో