Page Loader
కర్ణాటకలో బీజేపీ ఓటమిని అంగీకరించిన సీఎం బసవరాజ్ బొమ్మై 

కర్ణాటకలో బీజేపీ ఓటమిని అంగీకరించిన సీఎం బసవరాజ్ బొమ్మై 

వ్రాసిన వారు Stalin
May 13, 2023
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఓటమిని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం అంగీకరించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో తనదైన ముద్ర వేయలేకపోయిందని, కాంగ్రెస్ ప్రజలను ఆకర్షించడంలో విజయవంతమైనట్లు చెప్పారు. పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత అంతర్గతంగా సమగ్రంగా విశ్లేషిస్తామని బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. జాతీయ పార్టీగా బీజేపీ వివిధ స్థాయిల్లో లోటుపాట్లను విశ్లేషించుకొని, అవి భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు. తాము అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయామని, లోపాలను సవరించుకొని పార్టీని పునర్వ్యవస్థీకరించి, లోక్‌సభ ఎన్నికల్లో బాగా రాణిస్తామన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీజేపీ ఓటమిపై స్పందించిన సీఎం బొమ్మై