
Andhrapradesh: మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో 24 మంది మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలను కేటాయించారు.
ఈ మేరకు జాబితాను విడుదల చేశారు.
పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు.
నారా లోకేశ్ (Nara Lokesh)కు విద్య (హెచ్‌ఆర్‌డీ), ఐటీ, ఆర్టీజీ శాఖలు, కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ అప్పగించారు.
హోం వ్యవహారాలు, విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ వంగలపూడి అనిత. పౌర సరఫరాలు నాదెండ్ల మనోహర్‌కు కేటాయించారు.
పెట్ సబ్జెక్ట్ టూరిజం శాఖను కూడా జనసేనకే ఇచ్చారు ఏపీ సీఎం.. మరోవైపు, కీలకమైన వైద్యారోగ్య శాఖను బీజేపీకి కేటాయించారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలుగుదేశం పార్టీ చేసిన ట్వీట్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే. లా అండ్ ఆర్డర్ శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం చంద్రబాబు గారు మానవ వనరుల అభివృద్ధి మరియు ఐటీ కమ్యూనికేషన్ శాఖలను లోకేష్ గారికి కేటాయించారు.#KutamiTsunami #NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/mhZiWofBkl
— Telugu Desam Party (@JaiTDP) June 14, 2024