Chandra Babu: అభిమాని చివరి కోరికను నెరవేర్చిన సీఎం చంద్రబాబు.. నెటిజన్లు ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన 30 ఏళ్ల యువకుడు పసుపులేటి సురేంద్రబాబు కేన్సర్‌తో బాధపడుతున్నాడు.
తన జీవితంలో ఒక్కసారైనా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవాలని ఆ ఆకాంక్షతో ఉన్నాడు.
ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఇక అతని తల్లిదండ్రులు టీడీపీ నేతల ద్వారా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డికి ఈ విషయాన్ని చెప్పారు.
ఎమ్మెల్యే, సీఎం సిబ్బందికి సమాచారం అందించారు
Details
బాధితుడికి రూ.5లక్షలు ఆర్థిక సాయం
చంద్రబాబు నాయుడు తిరుమలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మునుపటి పర్యటన తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, సురేంద్రను కలిశారు.
ముఖ్యమంత్రి ని కలుసుకోవడం చూసి సురేంద్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సంతోషంతో ఫోటో దిగారు.
బాధితుడు సురేంద్రకు రూ.5 లక్షలు చికిత్స నిమిత్తం చెక్కును అందించారు.
సురేంద్రకు ఏ అవసరం ఉన్నా తాను సాయం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వైద్యులు సురేంద్రకు కేన్సర్ నాలుగో దశలో ఉందని తెలిపారు.