Chandrababu Naidu: పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు భారీ ప్లాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశ్రమలను తీసుకొచ్చేందుకు భారీ ప్రణాళికలను చేపడుతున్నాడు.
ఐదేళ్లుగా ఏపీ ఇమేజ్‌పై పడిన మరకల్ని తుడిచేసి, కొత్త ఇమేజ్ బిల్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు సమావేశమై, పెట్టుబడులను పెట్టాలని కోరారు.
ముఖ్యంగా జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా వెనక్కిపోయిన వారితోనూ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
ఏపీలో ప్రస్తుత పరిస్థితుల బట్టి మరింత మెరుగైన ఇండస్ట్రీయల్ పాలసీ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
Details
కొత్త ఇండస్ట్రియల్ పాలసీపై ప్రభుత్వం కసరత్తులు
ప్రస్తుతం కొత్త ఇండస్ట్రియల్ పాలసీపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
పరిశ్రమలకు ప్రభుత్వంపై భారం పడకుండా వీలైనంతగా ప్రోత్సహకాలు ఇవ్వాలని చూస్తోంది.
ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా గ్యారెంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొత్త పాలసీలో కొన్ని ప్రత్యేక రంగాలకు భారీ రాయితీలు ప్రకటించే అవకాశముంది.
ముఖ్యంగా ఈవీ, ఐటీ రంగాలకు ప్రోత్సాహకాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే భారీ పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి.