LOADING...
CM Chandrababu: ఉన్నత విద్యకు వడ్డీలేని రుణం..అన్ని వర్గాల వారికీ వర్తింపు: చంద్రబాబు
ఉన్నత విద్యకు వడ్డీలేని రుణం..అన్ని వర్గాల వారికీ వర్తింపు: చంద్రబాబు

CM Chandrababu: ఉన్నత విద్యకు వడ్డీలేని రుణం..అన్ని వర్గాల వారికీ వర్తింపు: చంద్రబాబు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2025
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనిని కేంద్ర ప్రభుత్వం పావలా వడ్డీకి అందజేస్తున్న రుణాల పథకంతో అనుసంధానిస్తామన్నారు అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు సౌకర్యంగా రుణాలను అందజేయాలని స్పష్టం చేశారు. ఈ రుణాల మంజూరుకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. 14 సంవత్సరాల అనంతరం తిరిగి చెల్లించవచ్చునని చెప్పారు. ఈ పథకాన్ని నైపుణ్య శిక్షణకూ వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. రుణంపై ఉండే వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా భరిస్తుంది అని వివరించారు. ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 చొప్పున నిధిని అందజేసే "ఆడబిడ్డ నిధి" పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

వివరాలు 

రజకుల అభివృద్ధి చర్యలు 

రజకులకు విద్యుత్తు లేదా సౌర శక్తితో నడిచే తోపుడు బండ్లు, ఎలక్ట్రికల్ ఇస్త్రీపెట్టెలు అందజేస్తామని తెలిపారు. 25 మందికంటే ఎక్కువ రజకులు ఉన్న ప్రాంతాల్లో ఆధునిక ధోబీఘాట్లు, షెడ్లు నిర్మించి, క్వారీల్లో వడ్డెరలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పారు. అలాగే, సీనరేజ్‌ను తగ్గించే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వివరాలు 

చర్చిల నిర్మాణం, అభివృద్ధికి ఆర్థిక సహాయం 

చర్చిల నిర్మాణానికి, మరమ్మతులకు ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టం చేశారు. జెరూసలేం యాత్రికులకు కూడా ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. క్రైస్తవ ఆస్తులకు అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసే ప్రణాళిక ఉందని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా కాకుండా నియమాలు అమలు చేస్తామని తెలిపారు. విజయవాడ హజ్‌హౌస్‌ నిర్మాణాన్ని పూర్తి చేయడం, మసీదుల నిర్వహణకు రూ.5 వేల ఆర్థిక సాయం ఇవ్వడం ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గిరిజనులకు సంబంధించిన జీవో 3ను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

వివరాలు 

అన్నీ ఏసీ బస్సులే.. 

ఆర్టీసీ బస్ స్టాండ్లను ఆధునికీకరించి, ఈవీ బస్సులను అందజేస్తామని ప్రకటించారు. వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసి, కార్గో సేవలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంపొందించాలని చెప్పారు. దేవుని ఆశీర్వాదంతో త్వరలో అన్ని ఏసీ బస్సులనే అందజేస్తామని అన్నారు. గతంలో ఆర్యవైశ్యులు వ్యాపారాలు చేసుకోవడంలో భయపడేవారని గుర్తుచేసి, వారికి అనువైన వాతావరణాన్ని కల్పించామని చెప్పారు. ఎన్నికల ముందుగా ఇచ్చిన హామీలను నెరవేర్చామని, ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు నిధులు కేటాయించినట్లు తెలిపారు. చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు కూడా అందజేయనున్నట్టు పేర్కొన్నారు.

వివరాలు 

బ్రాహ్మణ కార్పొరేషన్‌ విధానం అనుసరణీయం 

బ్రాహ్మణ కార్పొరేషన్‌లో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి అందరూ అమలు చేయాల్సిందిగా సూచించారు. ప్రభుత్వం ఇచ్చే నిధులను కార్పస్‌లో ఉంచి, దాతల సహాయంతో స్థిరమైన ఆదాయాన్ని, ఆస్తులను సృష్టించారని వివరించారు. కమ్యూనిటీ లీడర్లను భాగస్వాములుగా చేయడం ద్వారా మోడల్‌ను సుస్థిరంగా నిర్మించినట్టు చెప్పారు. త్వరలో శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు త్వరలో శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని చెప్పారు. శ్మశాన వాటికలకు స్థల కేటాయింపును కలెక్టర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జర్నలిస్ట్‌ల గృహనిర్మాణం పథకం అమలవాలని తెలిపారు.

వివరాలు 

కాపు భవనాలు పూర్తి చేయాలి.. 

కాపు భవనాల నిర్మాణానికి అవసరమైన భూములను కేటాయించి పూర్తిచేస్తామని తెలిపారు. మత్స్యకారులకు మంచి జీవనోపాధి కావాలని, దీనికోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. యూనివర్సల్ హెల్త్ కార్డు యూనివర్సల్ హెల్త్ కార్డును త్వరలోనే అమల్లోకి తీసుకురావాలని చెప్పారు. డిజిటల్ కార్డులు అందజేస్తామని తెలిపారు. అన్నదాతా సుఖీభవ పథకంలో రైతులకు సంబంధించిన KYC సమస్యను 100% పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో యువతకు ఉపాధి కోసం జాబ్‌ మేళాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

వివరాలు 

హత్య కేసుల విచారణ, ఆర్థిక సాయం 

తోట చంద్రయ్య, అమర్‌నాథ్ గౌడ్, జాలయ్య యాదవ్, బాల సుబ్బారావు హత్య కేసులు వేగవంతంగా విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు జీవో-217 ప్రకారం ఆర్థిక సాయం అందజేశామని పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం తదితర కేసులపై కూడా విచారణ జరుపుతున్నట్టు స్పష్టం చేశారు.