
Chandrababu: MSME పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో తొలి దశగా నిర్మాణం పూర్తయిన 11ఎంఎస్‌ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని నారంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వర్చువల్ విధానంలో ఈ పార్కులను ప్రారంభించారు.
మొత్తం రూ.216కోట్ల వ్యయంతో ఈ 11పార్కుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసింది.
ఇవి కాకుండా, అదనంగా మరో 39ఎంఎస్‌ఎంఈ పార్కులను రూ.376 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రారంభించిన పార్కులు అనకాపల్లి,పీలేరు,రాజానగరం,బద్వేల్,గన్నవరం,పాణ్యం,డోన్,ఆత్మకూరు (నారంపేట),దర్శి,పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయబడ్డాయి.
వీటితో పాటు,రాంబిల్లిలో నిర్మించిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్‌ఎఫ్‌సీ) కూ ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు.
2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 175ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నారంపేటలో MSME పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ఆత్మకూరు నియోజకవర్గం, నారంపేటలో MSME పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. pic.twitter.com/sgrxQPJFrj
— BIG TV Breaking News (@bigtvtelugu) May 1, 2025