Page Loader
Chandrababu: కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఓపెన్ చేసిన సీఎం చంద్రబాబు
కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఓపెన్ చేసిన సీఎం చంద్రబాబు

Chandrababu: కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఓపెన్ చేసిన సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ముందుగా పరిశీలించిన ఆయన, తర్వాత జలవనరుల శాఖ అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం కృష్ణానదికి జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రైతులతో కలిసి శ్రీశైలం ప్రాజెక్టులోని నాలుగు గేట్లను ఎత్తి నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. ఇందులో 6, 7, 8, 11 నంబర్ గేట్లు ఎత్తారు. ఫలితంగా కృష్ణానది ప్రవాహం ఉధృతంగా సాగుతోంది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు