LOADING...
CM Chandrababu: రేపు దిల్లీకి సీఎం చంద్రబాబు పయనం.. కేంద్ర మంత్రులతో భేటీకి సిద్ధం!
రేపు దిల్లీకి సీఎం చంద్రబాబు పయనం.. కేంద్ర మంత్రులతో భేటీకి సిద్ధం!

CM Chandrababu: రేపు దిల్లీకి సీఎం చంద్రబాబు పయనం.. కేంద్ర మంత్రులతో భేటీకి సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు రాత్రి దిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం కూడా ఉందని సమాచారం. ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును భారతీయ జనతా పార్టీ ఈ రోజు జరుగుతున్న పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఖరారు చేయనుంది. నిర్ణయం అనంతరం ఎన్డీయే అభ్యర్థి ఈనెల 21వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Details

20న ఎన్డీయే నేతల భేటీ

ఈ కార్యక్రమానికి ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కీలక నాయకులు హాజరు కానున్నారు. అంతేకాకుండా నామినేషన్ కార్యక్రమానికి ముందు 20వ తేదీన ఎన్డీయే నేతల భేటీ జరగనుంది. ఆ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.